Monday, August 31, 2026

పంచాయతీ కార్మికులను నియమించాలని డిమాండ్

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాకర్ ఫారం సర్పంచ్

కోటగిరి: ఆగస్టు 31 ద్రోణ

పంచాయతీ కార్మికులను నియమించాలని, గ్రామంలో ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజావాణిలో భాకర్ ఫారం సర్పంచ్ కనక మేడల శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. గతంలో హెగ్డోలి గ్రామపంచాయతీ పరిధిలో డాక్టర్ ఫారం గ్రామం ఉండేది. పరిపాలన సౌలభ్యం పేరిట గ్రామాన్ని రెండు ముక్కలుగా చీల్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు గ్రామాలు గా విడగొట్టిన అధికారులు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేశారు. చేతులు దులుపుకున్నారు. ఎన్నికలు జరిపి 8 నెలలు గడుస్తున్నా నేటి వరకు పంచాయతీ కార్మికులను ఏర్పాటు చేయకపోవడంతో గ్రామంలో సమస్యలు తిష్ట వేశాయి. ప్రతినిత్యం అధికారులు మాత్రం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి, అభివృద్ధి చేయాలి మరెన్నో పథకాలను గ్రామపంచాయతీ వారు చేపట్టాలంటూ హుకుం మాత్రం జారీ చేస్తూ ఉంటారు. నేటి వరకు కార్మికుల నియామకంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా గ్రామపంచాయతీ ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలకు గ్రామ కార్యదర్శులు సైతం నియమించలేదు. గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు వాటిని ప్రజల దారిన చేర్చటానికి గ్రామంలో కనీసం ఇద్దరు ముగ్గురు కార్మికులు అవసరం. ఇట్టి విషయంలో ఎన్నో పర్యాలు అధికారులు దృష్టి తీసుకువచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల నేడు ప్రజావాణిలో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని గ్రామ సర్పంచ్ తెలిపారు. ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు కూలీలు సైతం తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. పనులు జరిపిన తమ ఖాతాల్లోకి డబ్బులు రావడంలేదని కొందరు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయాన్ని నిజామాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సాయన్న దృష్టి సైతం తీసుకువెళ్లిన ఫలితం దక్కలేదు. ఇప్పటికైనా ఫీల్డ్ అసిస్టెంట్ నియమించి కూలీలకు పనులు కల్పించాలని గ్రామ కూలీలు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఉపాధి హామీలో మెటీరియల్ కాంపోనెంట్ పనులను చేపట్టిన వాటి బిల్లులను పాత గ్రామపంచాయతీలోనే జమ చేస్తున్నారు. 15 ఫైనాన్స్ డబ్బులు సైతం పూర్తిస్థాయిలో నూతన గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ కాలేదు. కొంతమేరకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ గ్రామాల్లో ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. 15 ఫైనాన్స్లో విడుదల చేసిన నిధులు గతంలో పనిచేసిన వారికే బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. నూతన గ్రామ పంచాయతీలకు స్థానిక పన్నుల రూపేనా కొద్దిపాటి డబ్బు మాత్రమే జమ అవుతుంది. మరి గ్రామాల్లో చేపట్టాల్సిన పారిశుధ్యం, వీధి దీపాలు, మంచినీటి సరఫరా లాంటి అత్యవసర పనులను జరపటానికి సైతం సర్పంచులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కార్యాలయాల్లో కుర్చీలకు పరిమితం కాకుండా గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని నూతన గ్రామ పంచాయతీల సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక సమస్యలను డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు దృష్టి సైతం సర్పంచ్లు తీసుకువెళ్లడం జరిగింది. గ్రామాల్లో ఇప్పటికే బోరు బావుల వీధి దీపాల కరెంట్ బిల్లులు తడిసి మోపుడై ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ బిల్లుల చెల్లింపు గ్రామ పంచాయతీలకు మోయలేని భారంగా మారబోతుంది. గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిశీలన జరిపి మండల స్థాయి అధికారులు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అధికారులు సమస్యలు పరిష్కరించలేక పోతే సర్పంచ్లే నేరుగా జిల్లా కేంద్రానికి వెళ్లి జిల్లా అధికారుల వద్ద తమ నిరసనను వ్యక్తం చేయాలన్న ఆలోచన సైతం ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular