Sunday, September 27, 2026

దేశ రక్షణలో భగత్ సింగ్ ఆదర్శప్రాయులు

తెల్ల దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మహానీయుడు

బోధన్ సెప్టెంబర్ 27, ద్రోణ

భారతదేశ రక్షణ తన ధ్యేయంగా పనిచేసిన భగత్ సింగ్ మన దేశానికి ఆదర్శప్రాయులని పలువురు వక్తలు కొని ఆడారు. భారతదేశ సంకెళ్ళను తెంపేందుకు తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవటం ఎంతో అవసరమన్నారు. బోధన్ పట్టణంలో శక్కర్ నగర్ ఎస్ సి బాయ్స్ హాస్టల్ లో భగత్ సింగ్ 119వ జయంతి నీ ఘనంగా నిర్వహించారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ పి డి ఎస్ యు- పి వై ఎల్- పి ఓ డబ్ల్యు ల ఆధ్వర్యంలో సదస్సు ను ఏర్పాటు చేశారు. సదస్సుకు పి ఓ డబ్ల్యూ బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి.నాగమణి అధ్యక్షత వహించారు. బోధన్ డివిజన్ కమిటీ సహాయ కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ షాహిద్ భగత్ సింగ్ తన చిరుప్రాయం నుండే దేశంలో జరుగుతున్న జాతీయ ఉద్యమం గురించి మన దేశ ప్రజలపై వారి అణిచివేతను ఆధిపత్య ధోరణులను సహించేవాడు కాదన్నారు. వారి కుటుంబ సభ్యులకు జాతీయ ఉద్యమంలో పోరాడిన వారేనని వారి స్ఫూర్తితో తన చిన్నతనం నుండే దేశం కోసం పోరాటాలు చేస్తున్న వారిపై కేసులు పెట్టి జైలకు పంపుతున్న విధానాలను చూసి ఓర్వలేకపోయాడని దేశం నుండి తెల్లవారు వెళ్లిపోవడమే కాకుండా దేశంలో ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేసే విధానం ఉండకూడదని భావించేవారని వివరించారు.

అదే నిజమైన దేశ స్వతంత్ర్య మని నినాదించారని భగత్ సింగ్ స్ఫూర్తితో నేడు అమెరికా ఆధిపత్య ధోరణులు, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. షాహిద్ భగత్ సింగ్ చూపిన ధైర్యం, త్యాగం, సామాజిక మార్పు కోసం సాగించిన పోరాట స్ఫూర్తితో యువత, విద్యార్తులు, మహిళలు ముందుకు సాగాలని, ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ప్రజల ఐక్య పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు బోధన్ పట్టణ అధ్యక్షురాలు నాగమణి పి డి ఎస్ యు హాస్టల్ కమిటీ నాయకులు మోతిరాం,రమేష్, జుపిటర్ మరియు డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular