
దిండి యాత్రలో హెచ్చరించిన జుక్కల్ ఎమ్మెల్యే

కామారెడ్డి సెప్టెంబర్ 27 ద్రోణ
పర్యావరణ కాలుష్యం మానవ మనుగడకే ముప్పు ఏర్పడుతుందని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతను గుర్తుంచుకోని మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టాలని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పిలుపునిచ్చారు. జుక్కల్ మండలం దోస్తుపల్లి నుంచి రత్నగిరి వరకు చేపట్టే దిండి యాత్రను దుఃఖాలు ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సందేశంతో నరేంద్ర మహారాజు భక్తులు నిర్వహిస్తున్న యాత్రను ఎమ్మెల్యే అభినందించారు. యాత్రలో మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాల్సిన అవశ్యకతను వివరించారు.

భక్తి విశ్వాసాలతో పాటు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్న ఈ యాత్రను విజయవంతంగా కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
