
నిజామాబాద్ సిపి సాయి చైతన్య ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్ సెప్టెంబర్ 27 ద్రోణ :- పోలీస్ కమిషనరేటు పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్ మరియు బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతీష్టాపన నుండి నిమజ్జనం వరకు పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకున్నారు. పోలీస్ కమిషనరేటు పరిధిలో 5811 గణేష్ విగ్రహాలు ప్రతిష్టించారు. ప్రతిష్టాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం 9 మరియు 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి నిమజ్జనం కార్యక్రమాలు పూర్తి చేశారు. అన్ని మతాల ప్రజలు స్వచ్చందంగా సహకరించుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బాసర బ్రిడ్జి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బాసర , ఉమ్మెడ ఇవి కాకుండా మిగితా చాలా ప్రదేశాలలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి వేడుకలు ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతీష్టాపన మరియు నిమజ్జనం వేడుకలు అన్నింటికి సార్వజనిక్ గణేష్ మండలి , విగ్రహ గణేష్ కమిటీలు , మజీద్ కమిటీలు, మరియు అన్నిమతాల ప్రజలు , ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించారన్నారు. వివిధ శాఖల అధికారులు సిబ్బంది ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతి మున్సిపాలటి , అబ్కారీ శాఖ, ఫైర్ సర్వీస్ మరియు ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, గజ ఈతగాళ్లు అందరూ వారి సేవలను అందించడం జరిగింది. మరియు పత్రిక ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా / ప్రింట్ మీడియా సిబ్బంది అందరూ సహకరించారు. అని స్పష్టం చేశారు. ఈ శుభ సందర్బంలో ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలుపుతున్నట్లు సిపి సాయి చై చైతన్య స్పష్టం చేశారు.
