
మూడేళ్లలో 1600 కోట్ల నిధులు కడియం
హైదరాబాద్ సెప్టెంబర్ 27 ద్రోణ
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని మూడేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి 1600 కోట్ల నిధులు రాబట్టానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందిస్తున్నామన్నారు.
గత 20 ఏళ్లలో నియోజకవర్గంలో అవినీతి రాజ్యం ఏలింది.చిల్లర పనులతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరువు తీశారన్నారు.
ప్రజలు ఎమ్మెల్యే పేరు చెప్పుకోలేని పరిస్థితి ఉండేది.నేను ఎమ్మెల్యే గా ఎన్నికైన 3ఏళ్లలోనే 1600 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయించాను.

నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
దేవాదుల ద్వారానే కరువు పరిస్థితులలో కూడా నియోజకవర్గంలో సాగు నీరు అందుతుంది.ఇరవై నాలుగు ఏళ్ల క్రితం ఘనపూర్ ప్రాంతానికి సాగు నీరు అందించేందుకు దేవాదులకు శ్రీకారం చుట్టామన్నారు. ఉమ్మడి జిల్లాకే పెద్ద దిక్కుగా మారి సాగు, త్రాగు నీరు అందిస్తుంది.నియోజకవర్గంలో ప్రతీ ఎకరానికి సాగు నీరు, నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం.
నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు.
నాపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయకక్ష్యతోనే విమర్శలు చేస్తున్నారు.
ఏ ఎన్నికలు వచ్చినా నిజాయితీగా కష్టపడి పని చేసే వారినే ఎన్నుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇప్పటికే 15ఏళ్ళు నష్టపోయాం మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు.సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి.10ఏళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం వందల ఎకరాలను కబ్జా చేశారు.
2014ఎన్నికల అఫిడవిట్ లో ఎకరం భూమి లేదని కేసీఆర్ చెప్పాడు.
2026 నాటికి వందల ఎకరాలు, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని కడియం ప్రశ్నించారు.
స్వయంగా కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ కు ఉన్న 1400కోట్ల పార్టీ ఫండ్ అక్రమంగా వచ్చిందని, అక్రమ నిధులు తెలంగాణ ఉద్యమకారులకు పంచాలని డిమాండ్ చేస్తుందని, కేసీఆర్ కు నిజంగా ఉద్యమకారులపై ప్రేమ ఉంటే వెంటనే 1400కోట్ల పార్టీ ఫండ్ ను ఉద్యమకారులకు పంచి నిజాయితీ నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ చేశారు.రఘునాథపల్లి మండలం రామచంద్రగూడెం, లక్ష్మి తండా, ఇబ్రహీంపూర్, ఫతేషాపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా రామచంద్రగూడెం లక్ష్మి తండా గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఇబ్రహీంపూర్ లో 32లక్షలతో నిర్మించిన సిసి రోడ్లతో పాటు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అలాగే ఫతేషాపూర్ గ్రామంలో 19లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు మరియు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యేమాట్లాడుతూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గత 15-20ఏళ్ళు అవినీతి రాజ్యం ఏలిందని, గత ఎమ్మెల్యే చిల్లర పనులతో నియోజకవర్గ పరువు తీశాడని విమర్శించారు. కనీసం ఎమ్మెల్యే ఎవరు అంటే పేరు చెప్పుకోలేని పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ 3ఏళ్లలోనే నియోజకవర్గ అభివృద్ధికి 1600 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లిన జరుగుతున్న అభివృద్ధి పనులు కనిపిస్తాయని చెప్పారు. నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరగడం లేదు అని విమర్శించే వారు ఒకసారి ఇబ్రహీంపూర్, ఫతేషాపూర్ గ్రామాలకు వచ్చి చుస్తే తెలుస్తుందని హితవు పలికారు. ఇప్పటికే 15ఏళ్ళు అభివృద్ధి లేక నష్టపోయమని మళ్ళీ అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఏ ఎన్నికలు వచ్చినా నిజాయితీగా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి పని చేసే వారినే ఎన్నుకోవలని సూచించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు, అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైన పెదాలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రతీ క్షణం ప్రయత్నిస్తున్నాని వెల్లడించారు. ఇబ్రహీంపూర్, ఫతేషాపూర్, రామచంద్రగూడెం, లక్ష్మి తండా ఈ నాలుగు గ్రామాలలోనే 12కోట్లతో రోడ్లు నిర్మాణం చప్పట్టినట్లు అలాగే ఒక్క రఘునాథపల్లి మండలంలోనే 30 కోట్లతో అన్ని గ్రామాలకు, తండాలకు రోడ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నాలుగు గ్రామాల రైతులు లో ఓల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని 2.45కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం చేసుకొని ఈ రోజు ప్రారంభించుకున్నట్లు పేర్కొన్నారు. దింతో పాటు సిసి రోడ్లు, కమ్యూనిటీ హల్లు, ఇందిరమ్మ ఇండ్లు, వాటర్ ప్లాంట్, హైమాస్ లైట్లు వంటి అనేక అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి అశ్వరావుపల్లి రిజర్వాయర్ ద్వారా ఇబ్రహీంపూర్, ఫతేషాపూర్ గ్రామాలకు సమృద్ధిగా నీరు అందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్వర్ రెడ్డి, స్థానిక ఇబ్రహీంపూర్, ఫతేషాపూర్ గ్రామాల సర్పంచులు పోకల శ్రీనివాస్, సుజాత, మండల పార్టీ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాజీ, కోళ్ల రవి, క్రాంతి, వివిధ గ్రామాల సర్పంచులు, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
