ఏనిమిది లక్షల క్యూసెక్కులు దాటిన వరద!

హైదరాబాద్ సెప్టెంబర్ 27 ద్రోణ:- వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం ఏనిమిది లక్షల క్యూసెక్కులు దాటడంతో దిగువ ప్రాంతాల్లోనూ నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కూనవరం, పోలవరం మీదుగా ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ (ఎస్‌ఏసీ) బ్యారేజీ వరకు వరద ఉధృతి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం వరద ప్రవాహం ఏనిమిది నుంచి తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉంది.
భద్రాచలం వద్ద నాలబై అడుగులు దాటిన నీటిమట్టం
భద్రాచలం వద్ద సెప్టెంబర్ ఇరువై అరు మధ్యాహ్నం ఒకటి గంటకు ఇరువై మూడు. అరవై అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం, అదే రోజు రాత్రి పది గంటలకు మూపై మూడు అడుగులకు చేరింది. సెప్టెంబర్ ఇరవై ఏడు తెల్లవారుజామున ఐదు గంటలకు ముపై తొమ్మిది .ఇరవై అడుగులుగా నమోదైన నీటిమట్టం, ఉదయం ఏడు గంటలకు నలబై. నలబై అడుగులకు పెరిగింది. ఇదే సమయంలో వరద ప్రవాహం ఏనిమిది లక్షల, పతొమ్మిది వేల, రేండు వందల ఏనబై ఐదు క్యూసెక్కులకు చేరింది.
సుమారు పదేనిమిది గంటల వ్యవధిలోనే నీటిమట్టం దాదాపు పదిహేడు అడుగులు పెరగగా, వరద ప్రవాహం రేండు. యబై తొమ్మిది లక్షల క్యూసెక్కుల నుంచి ఏనిమిది. పతొమ్మిది లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి తీవ్రతను సంతరించుకుంది.
కూనవరం, పోలవరం వద్ద పెరుగుతున్న ప్రవాహం
దిగువ గోదావరిలోనూ వరద ప్రవాహం పెరుగుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా సమాచారం ప్రకారం కూనవరం వద్ద నీటిమట్టం పదునాలుగు. ఏనిమిది మీటర్లు, పోలవరం వద్ద తొమ్మిది. తొంబై ఏనిమిది మీటర్లుగా నమోదైంది.
పోలవరం వద్ద సెప్టెంబర్ ఇరువై ఆరు ఉదయం తొంమిది గంటలకు ఐదు లక్షల,మూపై ఏడు వేల, ఐదు వందల మూపై ఏనిమి క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం, సెప్టెంబర్ ఇరువై ఏడు అర్ధరాత్రికి ఐదు లక్షల, నలబై తొమ్మిది వేల,ఒక వంద ఆరవై ఐదు క్యూసెక్కులకు చేరింది. ఉదయం ఆరు గంటలకు ఐదు లక్షల, డేబై ఏనిమిది వేల ఏనబై ఏడు (5,78,087) క్యూసెక్కులకు పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో దిగువ ప్రాంతాల్లోనూ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది.
ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు
ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఐదు. ఆరవై ఒకటి లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి. భద్రాచలం వద్ద పెరిగిన వరద ప్రవాహం దిగువకు చేరుతున్న నేపథ్యంలో రానున్న గంటల్లో ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
తొమ్మిది లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం

గోదావరి వరద ప్రవాహం ఏనిమిది నుంచి తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అనంతరం వరద క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సేవల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కల్వర్టులు, కాజ్‌వేల వద్ద ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని, నదిలో స్నానం, ఈత, చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
ఈ సీజన్‌లో గోదావరిలో ఇది మూడో వరద స్పెల్‌గా నమోదైంది. భద్రాచలం వద్ద పెరిగిన భారీ వరద ప్రవాహం దిగువకు కదులుతున్న నేపథ్యంలో కూనవరం, పోలవరం, ధవళేశ్వరం ప్రాంతాల్లో నమోదయ్యే తదుపరి ప్రవాహ గణాంకాలు కీలకంగా మారాయి.
