
బెల్లాల్ గ్రామంలో ముగ్గురు లబ్ధిదారులకు రూ.3.03 లక్షల ఆర్థిక సాయం
బోధన్: బోధన్ శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా సోమవారం రవి గార్డెన్‌లో బెల్లాల్ గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.3,00,348 విలువైన చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బెల్లాల్ మాజీ సర్పంచ్ సంజీవ్, వార్డు సభ్యుడు ప్రసాద్ పాల్గొన్నారు.
