మరో ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పేర్లనూ సిఫార్సు చేసిన కొలీజియం

న్యూఢిల్లీ సెప్టెంబర్ 29ద్రోణ:- సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ జాబితాలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ సునీతా అగర్వాల్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులకు ఆమోదం తెలిపితే, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య (37)మూపై ఏడుకు చేరనుంది. ఇదిలా ఉండగా, గతంలో మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ వినోద్ కుమార్ను తిరిగి తెలంగాణ హైకోర్టుకు నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది.