అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు..

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి హెచ్చరిక
బోధన్: గంజాయి, మత్తు పదార్థాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. గంజాయి వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసు శాఖ మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. బెల్లాల్లో ఎక్కువగా గంజాయి కేసులు నమోదవుతున్నాయని దానిపై చానా జాగ్రత్తగా యువతను దూరంగా ఉంచాలని హెచ్చరించారు బోధన్ లో గంజాయి, డ్రగ్స్, వంటి మత్తు పదార్థాలకు పై యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని బోధన్ పోలీసులకు సూచించారు.

ఎవరైనా గంజాయి, డ్రగ్స్ సేవిస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లు లేదా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.