మాట ఇస్తే వెనకడుగు వేసేది లేదు

వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన “పోచారం భాస్కరన్న భరోసా”

భాస్కర్ రెడ్డిని అభినందించిన మీడియా అకాడమీ చైర్మన్

నిజామాబాద్ బ్యూరో సెప్టెంబర్ 30, ద్రోణ

తన నిజ జీవితంలో ఎవరికైనా మాటిస్తే వెనకడుగు వేసేది లేదని ఇప్పటివరకు తాను ఎవరికి మాట ఇచ్చినా మాటను నిలబెట్టుకుని తీరానని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. సమాజంలో ఎంతోమంది ఎన్నో కష్టాలతో బతుకు బండి కొనసాగిస్తుంటారని, వారిలో కొంతమంది ఆపదలో తమను ఆదుకోవాలని వస్తూ ఉంటారని అటువంటి వారిని ఆదుకోవడమే తన జీవిత లక్ష్యం అని స్పష్టం చేశారు. అంగవైకల్యం కలవారు ఎందరో ఎన్నో బాధలను పడుతున్న వారిని చూసి తన మనసు చెల్లించడం వల్లే తాను వికలాంగులకు ఆదుకొని వారిని మనలా సమాజంలో తలెత్తుకునేలా చేయాలన్న దృఢ సంకల్పంతో వికలాంగులకు చేయూతను అందించ తలపెట్టానని భాస్కర్ అన్న తన మనోభావాలను వ్యక్తం చేశారు.బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో మాజీ డీసీసీబీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి నిర్వహించిన బాన్సువాడ నియోజకవర్గ వికలాంగుల జీవితాల్లో పోచారం భాస్కరన్న భరోసా” కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఈ కృత్రిమ పరికరాలను అమర్చే డాక్టర్ అతుల్ పాల్గొన్నారు.
వివిధ కారణాలతో అంగవైకల్యానికి గురైన ముగ్గురు వికలాంగులలో కరణ్ సింగ్ కి కృత్రిమ చేయి, మహమ్మద్, యాదగిరి లకు కృత్రిమ కాళ్లు లండన్ ( UK ) కు చెందిన సుమారు ఒక్కొక్కటి 2 లక్షల రూపాయలకు చెందిన ఎండోలైట్ కంపెనీ కి చెందిన కృత్రిమ సహాయ పరికరాలను అందజేశారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపేలా సహాయాన్ని అందించడం అభినందనీయమని పోచారం మరియు రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
“అంగవైకల్యం వారి జీవితానికి అడ్డంకి కాకూడదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవసరమైన సహాయక పరికరాలను పొందలేని కుటుంబాలకు అండగా నిలవాలనే మానవతా దృక్పథంతో నా చిన్న కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి తన వంతు సహకారం అందిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం.. అవసరమైన సహాయం అందిస్తాం అనే భరోసాను కల్పిస్తున్నారు.
నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, అవసరమైన వారికి సహాయక పరికరాలను అందించే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ప్రతి మండలంలో క్యాంపు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారునియోజకవర్గంలో కాళ్లు, చేతులు కోల్పోయిన వికలాంగులకు లండన్ UK లో తయారయ్యే ఆధునిక సహాయక పరికరాలను అందిస్తున్నామని తెలిపారు. అలాంటి పరికరాలు అందుబాటులోకి వస్తే వారు తిరిగి తమ పనులను తాము చేసుకునే అవకాశం కలగడంతో పాటు ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, జీవితంపై భరోసా పెరుగుతుందని అన్నారు.
ఆర్థిక పరిస్థితులు వారి జీవితానికి అడ్డంకిగా మారకుండా అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కరోనా సమయంలోనూ ప్రజల వెంటే..

కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేసుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి, “కరోనా సమయంలో బాధితుల కోసం మేము సుమారు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశాం. ఆ సమయంలో పూర్తిగా ప్రజల కోసం పనిచేశాం. కరోనా బారిన పడిన బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలిచి ధైర్యం చెప్పాం.. మనోధైర్యాన్ని కల్పించాం” అని తెలిపారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి పక్కన నిలబడటమే నిజమైన మానవత్వమని ఆయన పేర్కొన్నారు. “ఇది ఓట్ల కోసం కాదు. రాజకీయాల కోసం కాదు. ఎవరి మెప్పు కోసం కాదు. ఇది మానవత్వం మన బాధ్యత. మన చుట్టూ ఉన్నవారు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి చేతనైనంత సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.
అంగవైకల్యంతో బాధపడుతున్న వారు తమ పరిస్థితిని శాపంగా భావించకుండా, వారికి అవసరమైన సహకారం అందించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో మీడియా అకాడమీ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ

సభ.. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన కార్యక్రమం.బలహీన వర్గాలకు అండగా నిలవడమే నిజమైన సేవ: పోచారం భాస్కర్ రెడ్డి కి అభినందనలు తెలిపారు.
కష్టపడి పనిచేసుకునే పరిస్థితి లేక, జీవితం భారంగా మారిన కుటుంబాలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం మానవత్వానికి ప్రతీక అని తెలిపారు.సహాయం చేయడానికి డబ్బు ఉండటమే ముఖ్యం కాదని, ఇతరుల కష్టాన్ని చూసి స్పందించే మనసు, మానవత్వం, సహృదయం ఉండటమే ముఖ్యమని పేర్కొన్నారు, డబ్బు ఉన్నవారు ఎంతోమంది ఉన్నప్పటికీ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండదని అన్నారు.రాజకీయాల్లో ఇచ్చే వాగ్దానాలు పదవులు, రాజకీయ పరిస్థితులు మారిన తర్వాత మరుగున పడే సందర్భాలు ఉంటాయని పేర్కొంటూ, పదవులతో సంబంధం లేకుండా ప్రజల కష్టాలను గుర్తించి, వారికి అవసరమైన సమయంలో అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని అన్నారు.
బాన్సువాడ ప్రాంత అభివృద్ధిలో పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కృషిని ప్రస్తావిస్తూ, గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధి చేసిన ప్రాంతాలు, మౌలిక వసతుల కల్పన వంటి అనేక కార్యక్రమాలు ఆయన కార్యదక్షతకు నిదర్శనంగా నిలిచాయని పేర్కొన్నారు.అదేవిధంగా ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద్వారా వేలాది మంది విద్యార్థులకు విద్యావకాశాలు లభించాయని, ఆ కళాశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందుతున్నారని తెలిపారు. విద్యా రంగంలో ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు బలమైన పునాది ఏర్పడుతుందని అన్నారు.
ముఖ్యంగా అంగవైకల్యంతో జీవిస్తున్న వారికి కృత్రిమ కాళ్లు, చేతులు వంటి సహాయక పరికరాలు అందించడం ద్వారా వారు తిరిగి తమ పనులను తాము చేసుకునే అవకాశం లభిస్తుందని, ఒక సహాయక పరికరం ఒక వ్యక్తికి కేవలం సాధనం మాత్రమే కాదని.. అతని కుటుంబానికి కొత్త ఆశ, ఆత్మవిశ్వాసాన్ని అందించే మార్గమని పేర్కొన్నారు.కష్టాల్లో ఉన్న బలహీన వర్గాలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపేందుకు ముందుకు వచ్చిన పోచారం భాస్కర్ రెడ్డి కి అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ

మాట ఇచ్చాను… మాట నిలబెట్టుకున్నాను

బాన్సువాడ పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో ముగ్గురు వికలాంగులకు నేను ఒక మాట ఇచ్చాను. వారికి అవసరమైన కృత్రిమ చేయి, కాలు అందించి, వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపుతానని హామీ ఇచ్చాను.ఈరోజు ఆ మాటను నిలబెట్టుకుంటూ ఆ ముగ్గురికి కృత్రిమ చేయి, కాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను.

మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచే ఒక మాట చెప్పారు.

“ఎవరికైనా మాట ఇస్తే, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మాటను తప్పకుండా నిలబెట్టుకోవాలి.”

ఆ మాటను నా జీవితంలో ఒక సూత్రంగా తీసుకున్నాను. అందుకే ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను ఈరోజు కార్యరూపంలోకి తీసుకొస్తున్నాను.
అయితే ఈ కార్యక్రమం ఈ ముగ్గురితోనే ఆగిపోదు.
మన నియోజకవర్గంలో అవసరం ఉన్న ప్రతి వికలాంగుడికీ, వారు తిరిగి నడవడానికి, తమ పనులను తాము చేసుకోవడానికి అవసరమైన సహాయం అందించేందుకు నేను సంకల్పించాను.

నా దగ్గర డబ్బు లేకపోవచ్చు
కానీ కొండంత ధైర్యం ఉంది.
ఆ దేవుడి ఆశీర్వాదం ఉంది.
మా నాన్నగారి ఆశీర్వాదం ఉంది.
నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి.

ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మన నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,ప్రజల సహకారం నాకు కావాలి
నేను మీ నుంచి ఆర్థిక సహాయం అడగడం లేదు
మీ గ్రామాల్లో ఉన్న వికలాంగులను గుర్తించి, నేను మండలాల వారీగా నిర్వహించే క్యాంపులకు వారిని తీసుకురావాలి. ఇదే మీ నుంచి నేను కోరుకునే సహాయం.వికలాంగులు అంటే కేవలం చేతులు లేదా కాళ్లు కోల్పోయిన వారు మాత్రమే కాదు.
కళ్లకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు కూడా నా దృష్టికి తీసుకురండి.
వారి సమస్యను తెలుసుకుని, సాధ్యమైనంత వరకు వారికి అవసరమైన సహాయం అందించేందుకు నేను కృషి చేస్తాను.ఒక్కరి జీవితంలో వెలుగు నింపడం కాదు…
మన నియోజకవర్గంలోని అవసరం ఉన్న ప్రతి కుటుంబంలో ఆశను నింపే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నదే నా సంకల్పం.కాబట్టి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలందరూ కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వికలాంగుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular