సైబర్ మోసాలపై అవగాహనకు నేడు నైట్‌వాక్‌

పీపుల్స్‌ ప్లాజా నుంచి 2 కిలోమీటర్ల మేర నిర్వహణ..

మొబైల్‌ ఫ్లాష్‌లైట్లతో పాల్గొనాలని పిలుపు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 01ద్రోణ:- సైబర్‌ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఆధ్వర్యంలో గురువారం అవగాహన మాసం కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజా వద్ద ‘సైబర్‌ సెక్యూరిటీ ఫ్లాష్‌–పాజ్‌ ఫర్‌ సేఫ్టీ’ పేరుతో రెండు కిలోమీటర్ల నైట్‌వాక్‌ నిర్వహించనున్నారు.

సైబర్‌ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, ఆన్‌లైన్‌ మోసాల నుంచి రక్షణ పొందే విధానాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు. సైబర్‌ నేరాల చీకట్లపై పోరాటానికి ప్రతీకగా నైట్‌వాక్‌లో పాల్గొనే వారు తమ మొబైల్‌ ఫ్లాష్‌లైట్లను ఆన్‌ చేయాలని టీజీసీఎస్‌బీ అధికారులు సూచించారు.
ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ పిలుపునిచ్చారు. సైబర్‌ మోసాల నివారణలో ప్రజల అప్రమత్తత కీలకమని, ప్రతి ఒక్కరూ సైబర్‌ భద్రతా చర్యలపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular