కుటుంబ కలహాలు

వివాహిత బలవన్మరణం
తొర్రూరు అక్టోబర్ 1 ద్రోణ :- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నపల్లి అంకిత (25) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు భర్తతో తరచూ కుటుంబ కలహాలు చోటుచేసుకోవడంతో ఆమె కొంతకాలంగా మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
అంకిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా, అంకిత దంపతులకు ఓ కుమార్తె ఉండగా, ఆమె కూడా కొన్నేళ్ల క్రితమే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.