కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు

పండుగ సీజన్ వేళ వ్యాపారులకు షాక్..

గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పులేదు

న్యూఢిల్లీ అక్టోబర్ 01 ద్రోణ: పండుగ సీజన్ ప్రారంభానికి ముందే వ్యాపారులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. అక్టోబర్‌ 1 నుంచి 19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.62.50 పెంచడంతో దాని ధర రూ.2,810కి చేరింది.

హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ సంస్థలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల్లో ప్రధానంగా వినియోగించే కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెరగడంతో వ్యాపార వర్గాలపై అదనపు భారం పడనుంది. పండుగల సమయంలో డిమాండ్‌ పెరిగే వేళ ఈ ధరల పెంపు వ్యాపారులకు ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది. 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించారు. దీంతో ప్రస్తుతం గృహ అవసరాల కోసం సిలిండర్‌ వినియోగించే వినియోగదారులపై తాజా ధరల పెంపు ప్రభావం ఉండదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular