తెలంగాణ కేబినెట్ భేటీ

ఉద్యోగులకు రెండు డీఏలు..

రూ.5 లక్షల బీమాపై చర్చ |

స్కిల్ యూనివర్సిటీ విలీనంపై కీలక నిర్ణయం

హైదరాబాద్ అక్టోబర్ 01 ద్రోణ:- తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. దసరా పండుగ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల కరువు భత్యం (డీఏ) విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొదటి డీఏ 3.64 శాతం, రెండో డీఏ 2.74 శాతం చొప్పున మంజూరు చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
కుటుంబ యజమాని మరణించిన సందర్భంలో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం విధివిధానాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఈ పథకాన్ని నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
స్కిల్ యూనివర్సిటీపై నిర్ణయం
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే అంశంపై కె. కేశవరావు కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ పరిశీలించనుంది. నివేదికలోని సిఫారసులపై చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పలు కీలక అంశాలపై చర్చ
22(ఏ) నిషేధిత భూముల జాబితాలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడం, కొత్త చేయూత పెన్షన్ల మంజూరు, రాజీవ్ యువ వికాసం, బతుకమ్మ–ఇందిరమ్మ చీరల పంపిణీ తదితర అంశాలపై మంత్రివర్గం సమీక్షించనుంది.
అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) భూసేకరణ, సిరిసిల్లలో నిరుపేదల ఇళ్ల స్థలాల హక్కుల అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

సాగునీరు..

ధాన్యం కొనుగోళ్లపైనా సమీక్ష
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సవరించిన ప్రాజెక్టు అంచనాలు, వానాకాలం ధాన్యం కొనుగోళ్ల కార్యాచరణపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది. డిసెంబరులో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పై కూడా సీఎం మంత్రులతో సమీక్షించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular