ఓయూ క్యాంపస్‌లో గంజాయి మొక్క.. కలకలం!

మొక్కను గుర్తించిన సిబ్బంది..

పోలీసులకు సమాచారం

ఎవరు నాటారనే కోణంలో దర్యాప్తు

హైదరాబాద్‌ అక్టోబర్ 01 ద్రోణ:- ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో గంజాయి మొక్క కనిపించడం కలకలం రేపింది. యూనివర్సిటీ పరిసరాల్లో మొక్కను గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మొక్కకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు సమాచారం.
యూనివర్సిటీ ప్రాంగణంలోకి గంజాయి మొక్క ఎలా వచ్చింది? ఎవరు నాటారు? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలిసింది. మొక్కను గుర్తించిన ప్రాంతం, పరిసరాల్లోని పరిస్థితులపై వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular