భర్త సమయం ఇవ్వడం లేదు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్‌ మూసాపేటలో విషాద ఘటన…

ఆగస్టులోనే వివాహం

హైదరాబాద్‌ అక్టోబర్ 01 ద్రోణ :- భర్త తనకు తగినంత సమయం కేటాయించడం లేదని మన స్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్‌లోని మూసాపేటలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన చందనాజ్యోతి (25)కి వెంకటసాయి యశ్వంత్‌తో ఆగస్టులో వివాహమైంది. వివాహం అనంతరం దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
చందనా జ్యోతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ ఇంటి నుంచే విధులు నిర్వహిస్తుండగా, ఆమె భర్త ఉద్యోగ రీత్యా బయటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో భర్త తనకు సమయం కేటాయించడం లేదని ఆమె తరచూ మనస్తాపానికి గురయ్యేదని, ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున చందనాజ్యోతి ఇంట్లో ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular