డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో మహిళ నగలు మాయ

వైద్య పరీక్షలకు వచ్చిన సమయంలో ఘటన..

40 గ్రాముల బంగారు నగలు అపహరణ

హైదరాబాద్‌ అక్టోబర్ 01 ద్రోణ :- ఏఎస్‌ రావునగర్‌లోని మెడ్‌ప్లస్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో మహిళకు చెందిన బంగారు నగలు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు వచ్చిన ఓ మహిళ వద్ద సుమారు 40 గ్రాముల బంగారు నగలు ఉన్నాయి. పరీక్షలు పూర్తిచేసుకుని ఇంటికి వెళ్లిన అనంతరం నగలు కనిపించకపోవడంతో ఆమె ఆందోళనకు గురైంది.

దీంతో ఘటనపై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి అక్కడి సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నగలు ఎక్కడ మాయమయ్యాయి, ఘటనకు ఎవరు పాల్పడ్డారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular