బేగంపేట జోన్ రద్దు….
ఉప్పల్ జోన్ ఏర్పాటు

పలు పోలీస్ డివిజన్ల పరిధుల్లో మార్పులు
హైదరాబాద్ అక్టోబర్ 01ద్రోణ:- జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ పోలీస్ శాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పోలీస్ కమిషనరేట్ల పరిధులను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా బేగంపేట లా అండ్ ఆర్డర్ జోన్‌ను రద్దు చేసి, కొత్తగా ఉప్పల్ జోన్‌ను ఏర్పాటు చేసింది. కొత్తగా ఉప్పల్, అల్వాల్, మేడిపల్లి లా అండ్ ఆర్డర్ డివిజన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఉప్పల్ ట్రాఫిక్ డివిజన్‌ను కూడా ఏర్పాటు చేశారు. నగరంలో పోలీస్ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా బడంగ్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను రద్దు చేశారు. అలాగే పలు పోలీస్ డివిజన్ల పేర్లలోనూ మార్పులు చేశారు. ఆర్జీఐఏ డివిజన్‌ను శంషాబాద్ డివిజన్‌గా, చిక్కడపల్లి డివిజన్‌ను కాచిగూడ డివిజన్‌గా, సంతోష్‌నగర్ డివిజన్‌ను ఛత్రినాక డివిజన్‌గా మార్చారు.
కొత్త జోన్లు, డివిజన్ల ఏర్పాటు, పేర్లు–పరిధుల మార్పులతో నగర పోలీస్ పరిపాలనా వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.