2023 ఎన్నికల్లో దానం నాగేంద్ర గెలుపుపై పిటిషన్ దాఖలు

తీర్పు వచ్చేవరకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలి
హైదరాబాద్ అక్టోబర్ 01 ద్రోణ :- ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ గెలుపును సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయకుండా స్టే విధించాలని ఆమె కోర్టును కోరారు.
ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌లో ఎన్నికల సంఘంతో పాటు దానం నాగేందర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎన్నికల పిటిషన్‌పై విచారణ పూర్తై తీర్పు వెలువడకముందే ఉప ఎన్నిక నిర్వహణకు చర్యలు చేపడితే న్యాయపరమైన అంశాలు తలెత్తే అవకాశం ఉందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీని నిలిపివేయడంతో పాటు, ప్రధాన ఎన్నికల పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు తదుపరి ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.