జంతర్‌ మంతర్‌ వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ నిరసనలకు పిలుపు

న్యూఢిల్లీ అక్టోబర్ 01 ద్రోణ:- కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ వ్యవహారశైలిని నిరసిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిరసనల నేపథ్యంలో జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌ 163ను అమలు చేస్తూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించి, నిరసనకారుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు.

మరోవైపు, పోలీసుల ఆంక్షలు, భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ శాంతియుతంగా నిరసన చేపడతామని యువత పేర్కొంటోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. దీంతో జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో ఉద్రిక్తతకు తావులేకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular