తక్కువ ధరకే మందులు..

జన్ ఔషధి కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు

మార్కెట్ ధరలతో పోలిస్తే 50–80 శాతం వరకు తక్కువ ధరకు జనరిక్‌ మందులు

న్యూఢిల్లీ అక్టోబర్ 4 ద్రోణ:- ప్రజలకు నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్ ఔషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. సాధారణ మార్కెట్‌ ధరలతో పోలిస్తే ఈ కేంద్రాల్లో పలు రకాల జనరిక్‌ మందులు 50 నుంచి 80 శాతం వరకు తక్కువ ధరకే లభిస్తాయి. జన్ ఔషధి కేంద్రాల్లో వేల రకాల ఔషధాలతో పాటు వందల రకాల సర్జికల్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దీంతో సాధారణ ప్రజలకు మందుల కొనుగోలు భారం కొంత మేర తగ్గుతుంది.

ప్రజలు తమకు సమీపంలోని జన్ ఔషధి కేంద్రాన్ని సులభంగా గుర్తించేందుకు ‘జన్ ఔషధి సుగమ్‌’ యాప్‌ అందుబాటులో ఉంది. ఈ యాప్‌ ద్వారా సమీపంలోని కేంద్రాల వివరాలు తెలుసుకోవడంతో పాటు వివిధ మందుల ధరలను పోల్చి చూసే అవకాశం కూడా ఉంది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న జన్ ఔషధి కేంద్రాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular