21 స్వర్ణాలు…
27 రజతాలు…
37 కాంస్య పతకాలు

ఢిల్లీ, అక్టోబర్ 04 ద్రోణ:-ఏషియన్ గేమ్స్–2026లో భారత్ సత్తా చాటింది. పురుషుల హాకీలో విజయంతో పోటీలను ముగించిన భారత్.. మొత్తం 21 క్రీడాంశాల్లో 85 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత ఖాతాలో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు చేరాయి.
అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 24 పతకాలు సాధించగా.. షూటింగ్‌లో 15, ఆర్చరీలో 9, బాక్సింగ్, రెజ్లింగ్‌లో ఆరేసి, స్క్వాష్‌లో 5 పతకాలు లభించాయి. సెయిలింగ్‌లో 3, క్రికెట్, కబడ్డీ, హాకీ, గోల్ఫ్‌లో రెండేసి పతకాలు భారత్ సాధించింది.
2022 ఏషియన్ గేమ్స్‌లోనూ భారత్ 106 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి 85 పతకాలతో అదే స్థానాన్ని కొనసాగించింది.