45 పైసలకే రూ.10 లక్షల రైలు ప్రయాణ బీమా

ఐఆర్సీటీసీ ప్రయాణికులకు అందుబాటులో బీమా సదుపాయం

హైదరాబాద్ అక్టోబర్ 04 ద్రోణ:- రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తక్కువ ప్రీమియంతో ప్రయాణ బీమా సదుపాయాన్ని అందిస్తోంది. ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో కేవలం 45 పైసలు చెల్లించడం ద్వారా రూ.10 లక్షల వరకు ప్రయాణ బీమా కవరేజీ పొందే అవకాశం ఉంది.

రైలు ప్రమాదంలో ప్రయాణికుడికి గాయాలైతే నిబంధనల ప్రకారం రూ.2 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. పాక్షిక వైకల్యానికి రూ.7.5 లక్షల వరకు, శాశ్వత వైకల్యం లేదా ప్రమాదంలో మరణం సంభవిస్తే రూ.10 లక్షల వరకు బీమా కవరేజీ అందుతుంది. తక్కువ మొత్తంతో ప్రయాణ సమయంలో ఆర్థిక భద్రత కల్పించే ఈ సదుపాయం ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular