విద్యార్థుల కోసం అలుపెరగని పోరాటం

నేహా బోరా పోరాటానికి జోహార్లు

న్యూఢిల్లీ అక్టోబర్ 04 ద్రోణ:- విద్యార్థుల హక్కులు, పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగ సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై జేఎన్‌యూ పరిశోధకురాలు, ఏఐఎస్‌ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ఆందోళనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. విద్యార్థుల సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వివిధ సందర్భాల్లో నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు.నీట్‌ పరీక్షల అంశంపై ఆమె 23 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల సమస్యల పరిష్కారం వంటి అంశాలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తాజాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించిన అంశంపై ఢిల్లీలో జరిగిన నిరసనలోనూ నేహా బోరా పాల్గొన్నారు. విద్యార్థి సమస్యలతో పాటు ప్రజాస్వామ్య, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపైనా ఆమె తన స్వరాన్ని వినిపిస్తున్నారు. రాజకీయంగా ఆమె అభిప్రాయాలతో ఏకీభవించినా, విభేదించినా.. తాను విశ్వసించే అంశాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలకు పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలను నిరంతరం ప్రస్తావిస్తూ ఉద్యమాల్లో పాల్గొంటున్న ఆమెకు పలువురు విద్యార్థి వర్గాల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular