పాక్‌ హనీట్రాప్‌లో నేవీ ఉద్యోగి.. అరెస్ట్

విశాఖ నేవల్‌ బేస్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌

ఏజెంట్‌కు చేరవేశాడని ఆరోపణలు

విశాఖపట్నం, అక్టోబర్ 04 ద్రోణ:- పాకిస్థాన్‌కు కీలక రక్షణ సమాచారాన్ని చేరవేశాడన్న ఆరోపణలపై నేవీ ఉద్యోగి ప్రదీప్‌ ముఖర్జీ (31)ని ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. పాక్‌కు చెందిన మహిళా ఏజెంట్‌ హనీట్రాప్‌ ద్వారా అతడిని వలలోకి దించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
బెంగాల్‌కు చెందిన ప్రదీప్‌ ముఖర్జీ 2014లో నేవీలో సైలర్‌గా ఎంపికయ్యాడు. అనంతరం విశాఖపట్నంలోని ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌లో విధులు నిర్వహించాడు. ఇటీవల పాక్‌ మహిళా ఏజెంట్‌ పరిచయంలోకి వెళ్లిన అతడు, ఆమెకు విశాఖ నేవల్‌ బేస్‌కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular