చక్కెరకు బదులు బెల్లం..? అయినా జాగ్రత్త!

బెల్లం కూడా పెంచుతుంది బ్లడ్‌ షుగర్‌……

మధుమేహులు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 04ద్రోణ:- బరువు తగ్గేందుకు, మధుమేహాన్ని నియంత్రించేందుకు చక్కెరకు బదులుగా బెల్లం వాడుతున్నారా..? అయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. బెల్లం ఆరోగ్యకరమైనదేనన్న భావనతో ఎక్కువగా తీసుకోవడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలోనూ అధిక శాతం సుక్రోజ్‌ ఉండటంతో పాటు చక్కెరతో సమానంగా కేలరీలు ఉంటాయి. గ్లైసెమిక్‌ సూచీ కూడా ఎక్కువగానే ఉండటంతో బెల్లం తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు. బెల్లాన్ని చక్కెరకు పూర్తిగా ప్రత్యామ్నాయంగా భావించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెల్లం అయినా చక్కెర అయినా పరిమితంగా తీసుకోవడం, మధుమేహులు వైద్యుల సూచనలకు అనుగుణంగా ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular