అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరిపెడ యువతి మృతి

సెయింట్‌ లూయిస్‌లో ట్రక్‌ ఢీకొనడంతో దారం సుప్రజ మృతి..

హైదరాబాద్ అక్టోబర్04ద్రోణ:- స్నేహితురాలికి తీవ్ర గాయాలు
అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన దారం సుప్రజ మృతి చెందారు. సెయింట్‌ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్న సుప్రజ.. రాత్రి రెస్టారెంట్ మూసివేసిన అనంతరం స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెతో ఉన్న స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది. సుప్రజకు భర్త, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో మరిపెడలోని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular