దేశంలోనే పొడవైన జాతీయ రహదారి..

NH-44
10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 4,112 కి.మీ. ప్రయాణం

హైదరాబాద్ అక్టోబర్ 04ద్రోణ:- దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారిగా ఎన్‌హెచ్‌-44 (NH-44) గుర్తింపు పొందింది. సుమారు 4,112 కిలోమీటర్ల పొడవున విస్తరించిన ఈ రహదారి ఉత్తరాన శ్రీనగర్‌ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు సాగుతుంది.
ఈ జాతీయ రహదారి 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా వెళ్తూ దేశంలోని కీలక ప్రాంతాలను అనుసంధానిస్తుంది. ఢిల్లీ, నాగ్‌పూర్‌, హైదరాబాద్‌, బెంగళూరు, మధురై వంటి ప్రధాన నగరాలను కలుపుతూ ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య రవాణా, వాణిజ్యానికి కీలక మార్గంగా సేవలందిస్తోంది.
దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడంతోపాటు సరుకు రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు NH-44 ప్రధాన రవాణా ధమనిగా కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular