దుబాయ్‌ ప్రిన్స్‌ ఆప్యాయత..

హైదరాబాద్ అక్టోబర్04ద్రోణ:- కెప్టెన్‌ స్మిత్‌కు ముద్దు
ఫ్లై దుబాయ్‌ ఘటనలో ప్రయాణికులను కాపాడిన పైలట్‌ను పరామర్శించిన హమ్దాన్‌ బిన్‌ మహ్మద్‌
ఫ్లై దుబాయ్‌ ఘటనలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యంగా వ్యవహరించిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ను దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ హమ్దాన్‌ బిన్‌ మహ్మద్‌ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన ఆయన కెప్టెన్‌ స్మిత్‌తో చేయి కలిపి, నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టి అభినందించారు.
విపత్కర పరిస్థితుల్లో ఎంతో బాధ్యతతో, ధైర్యసాహసాలతో వ్యవహరించారని ప్రశంసించారు. కెప్టెన్‌ స్మిత్‌ తమ ఫ్లైదుబాయ్‌ బృందానికి, దేశ చరిత్రలో భాగమైన వ్యక్తిగా నిలిచారని పేర్కొన్నారు. దేశం తరఫున ఆయనకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular