దసరా నుంచి తెలంగాణలో కొత్త పింఛన్లు

సామాజిక పింఛన్లకు అర్హుల జాబితా సిద్ధం..

బతుకమ్మ చీరల పంపిణీకి సన్నాహాలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 04 ద్రోణ::- తెలంగాణలో దసరా సందర్భంగా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కొత్త సామాజిక పింఛన్ల కోసం అర్హుల జాబితాను త్వరలో సిద్ధం చేసి, దసరా నుంచి కొత్త పింఛన్లు అందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో బతుకమ్మ చీరల పంపిణీని కూడా త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి చీరల డిజైన్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేసీఆర్‌ కిట్‌ తరహాలో మరో కొత్త పథకాన్ని కూడా దసరా సందర్భంగా ప్రారంభించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే కొత్త పింఛన్లు మంజూరు, చీరల పంపిణీ, కొత్త పథకం ప్రారంభంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular