18న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ భారీ ఏర్పాట్లు

హైదరాబాద్ అక్టోబర్ 04ద్రోణ:- తెలంగాణలో బతుకమ్మ వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ 10 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. చివరి రోజైన అక్టోబర్ 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే రవీంద్రభారతిలో పది రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ బతుకమ్మకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.