(APK) ఎ,పి,కె ఫైల్ పంపి ఫోన్ హ్యాక్.. రూ.69,785 కాజేసిన సైబర్ నేరగాళ్లు

మేడ్చల్,అక్టోబర్ 04 ద్రోణ:– వాటర్ బిల్లు అప్డేట్ చేయాలంటూ వాట్సాప్‌లో (APK) ఫైల్ పంపి ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. మేడ్చల్ జిల్లా చౌదరిగూడకు చెందిన రాజశేఖర్ (35)కు సెప్టెంబర్ 21న గుర్తుతెలియని నంబర్ నుంచి వాటర్ బిల్లు అప్డేట్ చేయాలంటూ (APK) ఫైల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి అడిగిన వివరాలు నమోదు చేసిన అనంతరం రూ.10 చెల్లించాడు.
అయితే పిన్ తప్పుగా ఉందంటూ సైబర్ నేరగాళ్లు పలుమార్లు ప్రయత్నింపజేసి, ఈ క్రమంలో (OTP)ఓ,టి,పి లను సైతం పంపించారు. అనంతరం అతడి ఫోన్‌ను హ్యాక్ చేసి కాల్ ఫార్వర్డింగ్ సెట్టింగ్స్‌ను మార్చేశారు. ఆ తర్వాత బాధితుడి ఖాతా నుంచి మొత్తం రూ.69,785 కాజేశారు.
తెలియని నంబర్ల నుంచి వచ్చే APK ఫైళ్లను డౌన్లోడ్ చేయొద్దని, OTPలు, బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.