
ప్రజలకు భద్రత, సత్వర పోలీస్ సేవలు అందించడమే లక్ష్యం
బోధన్ అక్టోబర్ 04ద్రోణ:- ప్రజల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో (24) గంటలు అందుబాటులో ఉండే పోలీస్ ఔట్‌పోస్ట్‌ను ఆదివారం ప్రారంభించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో ఔట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, వైద్యులు, సిబ్బందికి ఎలాంటి పోలీస్ సహాయం అవసరమైనా సత్వరం అందేలా ఔట్‌పోస్ట్ పనిచేయనుంది. 24 గంటల పాటు పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండడంతో ఆసుపత్రి పరిసరాల్లో భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది.

కార్యక్రమంలో బోధన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ, రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్‌ఐ రామ్, డాక్టర్ రహీమ్, ఆసుపత్రి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.