వాట్సాప్ స్టేటస్‌తో స్పందన…

రూ.45,400 ఆర్థిక సాయం
వర్ని అక్టోబర్ 04 ద్రోణ:- ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి సమాజ సేవకుడు సీతలే రమేష్ మానవత్వాన్ని చాటుకున్నారు. వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన తిప్పారం ఆనంద్ గౌడ్ కవల పిల్లలు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో అత్యంత విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి వైద్య ఖర్చులు భరించడం కష్టంగా మారడంతో సహాయం కోసం వారు ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న జలాల్పూర్ గ్రామానికి చెందిన కొందరు స్నేహితులు సమాజ సేవకుడు సీతలే రమేష్‌ను సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించిన రమేష్, తన వాట్సాప్ స్టేటస్ ద్వారా విషయాన్ని తెలియజేసి సహాయం చేయాలని కోరారు. దీనికి స్పందించిన పలువురు దాతలు అందించిన విరాళాలతో రూ.45,400 నిధులు సమకూరాయి. సేకరించిన మొత్తాన్ని వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ బంధువులకు సీతలే రమేష్ అందజేశారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన దాతలకు, సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సేవా కార్యక్రమంలో సమాజ సేవకుడు సీతలే రమేష్, బుర్ఖా శంకర్ గౌడ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్‌తో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పోతంగల్, కోటగిరి, బీర్కూర్ మండలాల్లో సీతలే రమేష్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు.