కృష్ణా జలాలు కుప్పానికి.. పాలమూరుకు కన్నీళ్లా?

రేవంత్ సర్కార్‌ చంద్రబాబుకు వాటర్ గిఫ్ట్ ఇస్తోంది: కవిత

మన నీళ్లు కుప్పానికి..

మన రైతులకు మొండిచేయి!
నార్లాపూర్‌ను నింపితే

పాలమూరును వదిలి.. కుప్పానికి కృష్ణా జలాలు!

రేవంత్ సర్కార్ తీరుపై కవిత తీవ్ర విమర్శలు

కర్ణాటకను అడిగి నీళ్లు తెచ్చామని బిల్డప్..

CBNకు వాటర్ గిఫ్ట్: కవిత
కృష్ణా నీళ్లపై కవిత సంచలన వ్యాఖ్యలు

“మహబూబ్‌నగర్‌కు రావాల్సిన నీళ్లు కుప్పం చేరుతున్నాయి.. రేవంత్ వాటర్ గిఫ్ట్ ఇస్తున్నారు”

పాలమూరుకు నీళ్లు రావడం లేదు..

నార్లాపూర్, కల్వకుర్తిని పట్టించుకోవడం లేదని విమర్శ

హైదరాబాద్, అక్టోబర్ 05 ద్రోణ:- కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మహబూబ్‌నగర్‌కు రావాల్సిన కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం వరకు వెళ్తున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబు నాయుడికి నీళ్లను గిఫ్ట్‌గా పంపిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్‌కు కొంత ఖర్చు చేసి ఉంటే ప్రస్తుతం నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని కవిత పేర్కొన్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ నింపి ఉంటే సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగేవని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉండేదని అన్నారు. ఒక వైపు కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, మరోవైపు తెలంగాణకు చెందిన కృష్ణా జలాలను కుప్పం వైపు తరలిస్తున్నారని కవిత ఆరోపించారు. మహబూబ్‌నగర్‌కు సమీపంలో ఉన్న నీళ్లు వందల కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి వెళ్తుండగా, పాలమూరుకు మాత్రం నీరు అందడం లేదని విమర్శించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, రైతులకు నవంబర్ వరకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని కవిత డిమాండ్ చేశారు. అలాగే కరువు మండలాలను ప్రకటించి రైతులకు కేంద్ర సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular