కోట్లాది ఓట్ల తొలగింపు సరికాదు

ఓటు హక్కు కోల్పోతే పౌరులను

రెండో తరగతి పౌరులుగా మార్చినట్లే..

జస్టిస్ ఉజ్జల్ భూయాన్

హైదరాబాద్, అక్టోబర్ 05 ద్రోణ: -భారత పౌరులకు ఓటు వేసే హక్కు రాజ్యాంగం కల్పించిన కీలక హక్కుల్లో భాగమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. కోట్లాది మంది పౌరుల ఓట్లను తొలగించే విధంగా ఏదైనా ప్రక్రియ కొనసాగడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడితే సంబంధిత పౌరులు దేశంలో రెండో తరగతి పౌరులుగా మారిన భావనకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల భాగస్వామ్యానికి ఓటు హక్కు కీలకమని, ఈ హక్కుకు సంబంధించిన ప్రక్రియల్లో రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులను పరిరక్షించే విధానం ఉండాలని జస్టిస్ భూయాన్ వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular