బెల్లాల్, అక్టోబర్ 05 ద్రోణ: బెల్లాల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో చేపడుతున్న సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ప్రజాప్రతినిధులు, నాయకులు పరిశీలించారు.

డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, ఏరాజ్‌పల్లి మాజీ సర్పంచ్ సంజీవ్‌రెడ్డి, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ సంజీవ్ తదితరులు పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను పూర్తి చేయాలని సూచించారు. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ, రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వారు తెలిపారు.