.9.60 కోట్లతో మెగా కమ్యూనిటీ కిచెన్‌

60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, భోజనం….

1,029 విద్యాసంస్థలకు సేవలు

మునగాల, అక్టోబర్ 05ద్రోణ:- సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు భారీ కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. మునగాల మండలంలో అక్టోబర్‌ 6న మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ మెగా కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
రూ.9.60 కోట్ల CSR నిధులతో నిర్మాణం సింగరేణి కాలరీస్‌ కంపెనీ సమకూర్చిన రూ.9.60 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో ఈ ఆధునిక వంటశాలను నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి 2027 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
60 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కిచెన్‌ పూర్తయిన అనంతరం సూర్యాపేట జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న సుమారు 60,000 మంది విద్యార్థులకు ఇక్కడే అల్పాహారం, భోజనం తయారు చేసి పంపిణీ చేయనున్నారు. పెద్ద స్థాయిలో ఆహార తయారీ, ప్యాకింగ్‌, రవాణా వంటి వ్యవస్థలను సమన్వయం చేసేలా కాన్సెప్ట్‌ డిజైన్‌ను రూపొందించారు.
ఆధునిక సదుపాయాలతో నిర్మాణం విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశుభ్రత ప్రమాణాలతో కిచెన్‌ను తీర్చిదిద్దనున్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఇది దేశంలోనే అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular