7.56 లక్షల క్లెయిమ్‌లు..
7.14 లక్షలు విచారణలోనే |

నవంబర్ 9న తుది ఓటరు జాబితా
హైదరాబాద్, అక్టోబర్ 05 ద్రోణ:- తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల దరఖాస్తులకు నేడు (అక్టోబర్ 7) చివరి గడువు. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి అవకాశం లభించే పరిస్థితి ఉండకపోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటివరకు SIRలో భాగంగా 7.56 లక్షల క్లెయిమ్‌లు, అభ్యంతరాల దరఖాస్తులు అందినట్లు సమాచారం. వీటిలో 7.14 లక్షల దరఖాస్తులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి నవంబర్ 5 వరకు గడువు ఉంది.
క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ పూర్తయిన అనంతరం నవంబర్ 9న తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. దీంతో ఓటర్లు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకుని ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.