కేబీఆర్‌ చుట్టూ రూటు మార్పులు

రూ.1,090 కోట్ల ప్రాజెక్టులో కీలక మార్పులు..

టీవీ9, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్ల

గ్రేడ్‌ సెపరేటర్లు రద్దు

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు–ముగ్ధ జంక్షన్‌–

ముఫఖమ్‌జా కాలేజీ వరకు పనులు..

MEILకే అప్పగింత

హైదరాబాద్‌, అక్టోబర్05ద్రోణ :– కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ప్రతిపాదించిన భారీ రహదారి ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. గతంలో ఖరారు చేసిన రూట్లు, డిజైన్లలో మార్పులు చేస్తూ కొత్త మార్గాన్ని తెరపైకి తెచ్చింది. రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలని ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ–1, 2 కింద చేపట్టాల్సిన పనులను ప్రభుత్వం పునఃసమీక్షించింది.జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ముగ్ధ జంక్షన్‌, అక్కడి నుంచి ముఫఖమ్‌జా కాలేజీ వరకు చేపట్టనున్న పనులను MEILకే అప్పగించింది. ఈ మార్గంలో నిర్మించనున్న స్టీల్‌ ఫ్లైఓవర్ల డిజైన్లు, నిర్మాణ సైట్లలోనూ మార్పులు చేసింది. ఇదే సమయంలో గతంలో ప్రతిపాదించిన టీవీ9, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్ల గ్రేడ్‌ సెపరేటర్లకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఈ రెండు జంక్షన్లలో చేపట్టాల్సిన పనులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గతంలో భారీగా ప్రతిపాదించిన ప్రాజెక్టులో తాజా మార్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి సంబంధించిన పాత ప్రతిపాదనల్లో కొన్నింటిని తొలగించి, అవసరమైన మార్గాల్లోనే పనులు చేపట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీంతో కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ నిర్వహణ కోసం గతంలో రూపొందించిన ప్రణాళికకు కొత్త రూపు వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో ఏ మార్గాల్లో పనులు కొనసాగనున్నాయి, ఏ ప్రతిపాదనలు పూర్తిగా తెరమరుగయ్యాయి అన్నదానిపై స్పష్టత వచ్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular