ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్

లైంగిక వేధింపుల ఆరోపణలు

కేసులో షరతులతో కూడిన బెయిల్..

రెండు నెలలకు పైగా జైలులో

హైదరాబాద్‌, అక్టోబర్ 05 ద్రోణ:- తోటి ఐపీఎస్‌ అధికారిణి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ లభించింది. రంగారెడ్డి జిల్లా ఉప్పర్‌పల్లి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో రెండు నెలలకు పైగా జైలులో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట లభించింది. జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ శిక్షణ పొందుతున్న సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించారని ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటన అప్పటి లో పోలీసు వర్గాలలో సంచలనం సృష్టించింది. తాజాగా ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఏర్పడింది. కేసు దర్యాప్తు, తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular