కొమ్ముల రాజేశ్వర్‌కు కన్నీటి వీడ్కోలు

అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి…

కుటుంబ సభ్యులకు పరామర్శ

నిజామాబాద్, సిరికొండ07ద్రోణ:-

నియోజకవర్గం సిరికొండ మండలం న్యావనంది గ్రామానికి చెందిన కొమ్ముల రాజేశ్వర్ అకాల మరణం పట్ల ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం న్యావనందిలో జరిగిన అంత్యక్రియలకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన హాజరయ్యారు.

రాజేశ్వర్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని రాజేశ్వర్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల ఎర్రన్న, ఉమ్మాజి నరేష్, పొలసాని శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular