మానవతా సేవలకు ‘రెడ్‌క్రాస్’ చేయూత

నూతన కమిటీతో సీపీ సాయి చైతన్య భేటీ…

రక్తదానం, తలసేమియా సేవల విస్తరణపై చర్చ

నిజామాబాద్, అక్టోబర్ 07ద్రోణ:- ప్రజలకు మరింత విస్తృతంగా మానవతా సేవలు అందించేందుకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ నూతన కమిటీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇటీవల ఎన్నికైన జిల్లా చైర్మన్ పోతంకర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులు బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు తమను పరిచయం చేసుకుని, జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న సేవా కార్యక్రమాలను సీపీకి వివరించారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహించడం, తలసేమియా బాధిత చిన్నారులకు అవసరమైన రక్త మార్పిడి సేవలు అందించడం, అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందుబాటులోకి తీసుకురావడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా యువతను రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాల వైపు ఆకర్షించి, వారిని మానవతా సేవల్లో భాగస్వాములను చేయడంతో పాటు జిల్లాలో మరిన్ని సామాజిక, సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కమిటీ సభ్యులు వివరించారు. ప్రజలకు అత్యవసర సమయాల్లో సేవలు మరింత వేగంగా అందేలా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందనలు తెలిపారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఆరా తీసిన ఆయన, ప్రజలకు ఉపయోగపడే మానవతా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ పోతంకర్ లక్ష్మీనారాయణ, కోశాధికారి కెంపుల నాగరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్, మేనేజింగ్ కమిటీ సభ్యులు దీకొండ యాదగిరి, బుస్స అంజనేయులు, కొండ సత్య ప్రసాద్, కరిపె రవీందర్, యెండల సుధాకర్, నరాల సుధాకర్, చౌహాన్ బాలాజీ, పద్మ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular