రాజ్యాంగంపై అవగాహనతోనే బాధ్యతాయుత

పౌర సమాజం
విద్యార్థులకు హక్కులు,

బాధ్యతలపై అవగాహన కల్పించిన దేవోల్లా శంకర్‌

రాజ్యాంగ ప్రతులు అందజేత

బోధన్, అక్టోబర్ 07ద్రోణ:- భారత రాజ్యాంగం, రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోధన్ కేంద్రియ విద్యాలయంలో రాజ్యాంగ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అడ్లూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి దేవోల్లా శంకర్ ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దేవోల్లా శంకర్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, భారత రాజ్యాంగం దేశ ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను అందించిందని తెలిపారు. ప్రతి విద్యార్థి రాజ్యాంగాన్ని, అందులో పొందుపరిచిన హక్కులు, విధులను తెలుసుకోవడం అవసరమన్నారు. యువతలో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌర సమాజ నిర్మాణానికి మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వీరేందర్ సింగ్, సురేష్ ఇనని, పెర్కా వెంకటేష్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా అడ్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు రాజ్యాంగ విలువలు, హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు రాజ్యాంగ ప్రతులను అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular