
అసత్య ప్రచారాలతో రైతులను తప్పుదోవ పట్టించొద్దని వడ్డీ మోహన్ రెడ్డి
బోధన్, అక్టోబర్ 07ద్రోణ:- రైతులను అయోమయానికి గురిచేసేలా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలు, వదంతులను నమ్మవద్దని వడ్డీ మోహన్ రెడ్డి సూచించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని వాస్తవమని భావించకుండా, సంబంధిత అధికారుల ద్వారా పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతే నమ్మాలని సూచించారు. అసత్య ప్రచారాల వల్ల రైతుల లో అనవసరమైన ఆందోళన, అయోమయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాస్తవాలను తెలుసుకోవాలని, వదంతులను ప్రచారం చేసే వారి మాటలను నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దని వడ్డీ మోహన్ రెడ్డి కోరారు. అధికారికంగా వెలువడే సమాచారం, సంబంధిత శాఖల సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.