ప్రజలకు రక్తదానం, సామాజిక సేవలు మరింత చేరువ చేయాలి:
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠరావు
నిజామాబాద్, అక్టోబర్ 07ద్రోణ:- ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన న్యాయవాది మల్లెపూలు జగన్మోహన్ గౌడ్ను నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాదులు జగన్మోహన్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠరావు మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ సంస్థను మరింత అభివృద్ధి చేయడంతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలకు రక్తదాన సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు మరింత చేరువయ్యేలా కృషి చేయాలని కోరారు. రెడ్‌క్రాస్ ద్వారా అందించే సేవలను విస్తృతం చేసి, అవసరమైన వారికి మరింత ప్రయోజనం చేకూరేలా కార్యవర్గ సభ్యులు పనిచేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది అందాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. రాజేశ్వర్ రెడ్డి, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్‌కుమార్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోమలింగ గౌడ్, న్యాయవాదులు కేశవరావు, కాసరనేని శరత్, పడిగేల వెంకటేశ్వర్, ఆల్గోట్ వరవీందర్, మెట్టు నరేష్, పులి జైపాల్, నారాయణదాస్, వసంతరావు, రోహన్, జయప్రకాష్ లోహియా తదితరులు పాల్గొన్నారు.