శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం

నూతన నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్‌కు

ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచనలు

నిజామాబాద్, అక్టోబర్ 8ద్రోణ:- నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్. శ్రీనివాస్ గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పుష్పగుచ్ఛం అందించి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతిభద్రతలు, ప్రజలకు అందుతున్న పోలీసు సేవలు తదితర అంశాలపై ఇరువురూ చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular