ప్రజాస్వామ్య పరిరక్షణ,

ఓటు హక్కు కాపాడాలంటూ నిరసన
హైదరాబాద్, అక్టోబర్ 8ద్రోణ:- కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిని నిరసిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ఓటు హక్కును కాపాడాలనే డిమాండ్లతో అఖిల రాజకీయ పార్టీల పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇండియా కూటమి, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘సేవ్ డెమోక్రసీ’ నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాల్సిన అవసరాన్ని నాయకులు ప్రస్తావించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ప్రారంభమైన ర్యాలీ లోక్‌భవన్ వైపు సాగింది. కార్యక్రమం సందర్భంగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి.