ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు పకడ్బందీ భద్రత

పరీక్షా కేంద్రాల 100 మీటర్ల

పరిధిలో సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 08ద్రోణ:- తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ తెలిపారు. అక్టోబర్‌ 11 నుంచి 17వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి.

ఆదర్శ హిందీ విద్యాలయం హైస్కూల్‌ హిందీ మీడియంలో ఎస్‌, ఎస్‌, సీ, ఆదర్శ హిందీ విద్యాలయం హైస్కూల్‌ ఇంగ్లిష్‌ మీడియంలో ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ (పాత సెక్షన్‌ 144 సీఆర్‌పీసీ) అమల్లో ఉంటుందని సీపీ తెలిపారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధమన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్‌ సెంటర్లు, జిరాక్స్‌ షాపులు, స్టేషనరీ దుకాణాలను పరీక్షా సమయాలలో తప్పనిసరిగా మూసి వేయాలని సంబంధిత యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
ప్రత్యేక బందోబస్తు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ తెలిపారు. కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తుల కదలికల పై నిఘా ఉంచడంతో పాటు, పరీక్షలకు ఎలాంటి ఆటంకం కలగకుండా భద్రతా చర్యలు చేపడతామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ సీపీ పి. సాయి చైతన్య విద్యార్థులకు “ఆల్‌ ది బెస్ట్‌” తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular