నేరాల విశ్లేషణ నుంచి సైబర్‌ దర్యాప్తు

ఆధునిక సాంకేతికత వినియోగంపై సమీక్ష

నిజామాబాద్‌, అక్టోబర్‌ 08ద్రోణ:- పోలీస్‌ శాఖలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగాన్ని మరింత విస్తృతం చేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసింగ్‌ను వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అదనపు డీసీపీ (అడ్మిన్‌) ఎన్‌. శుభం ప్రకాష్‌ తెలిపారు.

పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో పోలీస్‌ శాఖలో ఏఐ వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు డీసీపీ (అడ్మిన్‌) ఎన్‌. శుభం ప్రకాష్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోలీసింగ్‌లో ఏఐ ఆధారిత సాంకేతికతను ఏయే రంగాల్లో వినియోగించుకోవచ్చన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. నేరాల విశ్లేషణ, నేరాల నివారణ, క్రైమ్‌ డేటా విశ్లేషణ, అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపు, ట్రాఫిక్‌ నిర్వహణ, సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణ, సైబర్‌ నేరాల దర్యాప్తు, సోషల్‌ మీడియా మానిటరింగ్‌తో పాటు ప్రజలకు పోలీస్‌ సేవలను మరింత వేగంగా అందించడంలో ఏఐను వినియోగించుకునే అవకాశాలను పరిశీలించారు. అ దేవిధంగా పోలీస్‌ సిబ్బందికి అవసరమైన శిక్షణ, సాంకేతిక నైపుణ్యాల పెంపు, విద్యాసంస్థల లో అందుబాటులో ఉన్న సాంకేతిక నిపుణుల సహకారంతో పోలీస్‌ శాఖకు ఉపయోగపడే ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌లు, అప్లికేషన్ల అభివృద్ధిపై కూడా చర్చించారు. విద్యాసంస్థలు, సాంకేతిక నిపుణులు, పోలీస్‌ శాఖ సమన్వయంతో పనిచేస్తే ప్రజా భద్రతకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు భవిష్యత్‌ పోలీసింగ్‌ను సాంకేతికత ఆధారితంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని శుభం ప్రకాష్‌ పేర్కొన్నారు
సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పోలీస్‌ శాఖ కూడా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని నేర నియంత్రణ, దర్యాప్తు, ప్రజా భద్రత, పోలీస్‌ సేవల్లో మరింత సమర్థవంతమైన ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

సమావేశంలో నవ్య భారతి జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ శిరీష్‌, విజయ రూరల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌. స్వప్న, ఫ్యాకల్టీ సభ్యులు సుజాత, నవ్య, లక్ష్మి, కాకతీయ కాలేజీకి చెందిన డి. వేణుగోపాల్‌, పి. నాగార్జున, క్షత్రియ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, సీఓడీ ఎం. లక్ష్మణ్‌తో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular